
‘భాగ్యలక్ష్మి’ సందడి
మదనపల్లె : స్థానిక సీటీఎం రోడ్డులో చందన షాపింగ్ మాల్ ను సినీనటి ఐశ్వర్య రాజేష్, బాల నటుడు రేవంత్ (బుల్లి రాజు) చేతుల మీదుగా సోమవారం ప్రారంభమైంది. స్థానికులు, అభిమానులు హాజరై సందడి చేశారు.ఇక్కడి వారి ఆత్మీయత, ఆదరణ మరువలేనిదన్నారు. తొలి రోజే వందల మంది షాపింగ్ ప్రియులు ఆసక్తితో కావాల్సిన వాటిని బంపర్ ఆఫర్లతో కొనుగోలు చేసి సంబరపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, డి.రమేష్, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మునిసిపల్ చైర్మన్ మనూజా పాల్గొన్నారు.

‘భాగ్యలక్ష్మి’ సందడి