బోర్డులు పీకేసి..భూములపై కన్నేసి | - | Sakshi
Sakshi News home page

బోర్డులు పీకేసి..భూములపై కన్నేసి

Aug 26 2025 7:40 AM | Updated on Aug 26 2025 8:06 AM

చర్యలు తీసుకుంటాం

ఖాళీ స్థలం కనిపిస్తే

కబ్జాకు అక్రమార్కుల యత్నాలు

పట్టించుకోని రెవెన్యూ అధికారులు

గుర్రంకొండ : విలువైన ప్రభుత్వం భూములపై అక్రమార్కుల కన్ను పడింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు వాలిపోతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు స్థలాన్ని పరిశీలించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఆ తరువాత అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను అక్రమార్కులు మాయం చేస్తూ.. కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకొన్న దాఖలాలు లేకపోవడం గమనార్హం.

జిల్లాలోని గుర్రంకొండ పట్టణానికి సమీపంలోని చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామం పక్కనే ఎన్‌హెచ్‌ 340 జాతీయ రహదారి సమీపంలో కోట్లాది రుపాయలు విలువచేసే ఫ్రభుత్వ భూములు ఉన్నాయి. సర్వేనంబర్‌ 87/8లో రెండు ఎకరాల భూమికి సంబంధించి ఇంతవరకు ఎవ్వరికీ పట్టా ఇవ్వలేదు. ఈ ప్రాంతంలో భూముల విలువ పెరిగిపోయింది. ఎకరం రూ.2 కోట్ల వరకు ఉంది. దీంతో కొంతమంది కబ్జాదారుల కన్ను ఈ భూమిపై పడింది. దీనిని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. రెవెన్యూ అధికారులు సదరు భూమిని కబ్జాదారుల నుంచి కాపాడుకోవడానికి సర్వే పనులు చేపట్టారు. జేసీబీతో సరిహద్దుల వద్ద కందకాలు తవ్విస్తుండగా వాటిని కొంతమంది కూటమినేతలు అడ్డుకుని రెవెన్యూ ఆధికారులను అక్కడి నుంచి పంపించేసిన సంఘటనలు ఉన్నాయి. కొన్నాళ్లుగా గుంభనంగా ఉన్న కబ్జాదారులు అప్పట్లో మళ్లీ కబ్జా ప్రయత్నాలు తిరిగి ప్రారంభించారు. ఈనేపథ్యంలో రెండునెలల క్రితం రెవెన్యూ అధికారులు సదరు స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వేనెంబరు 87/8లో ఎవరికి కూడా పట్టాలు ఇవ్వలేదని, ఇందులో ఎవరైనా ప్రవేశించినా, ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు.వీటిని అక్రమార్కులు పీకేశారు.

మండలంలోని ఖండ్రిగ గ్రామంలో ప్రభుత్వస్థలంలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామ పరిధిలోని 503–8లో వంక పోరంబోకు స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుని చదును చేసుకొన్నారు. మురాద్‌బీ కుంటకు వర్షపునీరు చేరే ఈ వంకను ఆనవాళ్లు లేకుండా చేశారు. జేసీబీలతో వంకను ధ్వంసం చేసి ప్లాట్లు విక్రయించడానికి సిద్ధం చేసుకొన్నారు. దీంతో గ్రామస్తులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ ఆదేశాల మేరకు వీఆర్వోలు, సర్వేయర్లు రెండునెలల క్రితం వంకస్థలాన్ని సర్వేచేశారు. రూ. కోటి విలువచేసే మొత్తం 25 సెంట్ల మేరకు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేల్చారు. ఈనేపథ్యంలో రెవెన్యూ అధికారులు మురాద్‌బీ వంక వద్దకఆక్రమణ గురైన ప్రభుత్వంలో హెచ్చరిక బోర్డు నాటించారు. ఈ స్థలం ప్రభుత్వానికి చెందినదని ఇక్కడ ఎవరైనా ప్రవేశిస్తే చట్టపరంగా చర్యలు తీసుకొంటాని అధికారులు హెచ్చరించారు.

హెచ్చరిక బోర్డులు మాయం

గుర్రంకొం మండలంలోని చిట్టిబోయనపల్లె, ఖండ్రిగ గ్రామాల్లో గతంల్లో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు మాయయ్యాయి. రెండు చోట్ల బోర్డులను ఆక్రమణ దారులు తొలగించేశారు. అసలు అక్కడ హెచ్చరిక బోర్డులు ఉన్నట్లు ఆనవాళ్లు లేకుండా చేసేశారు. దీంతో రూ. 5 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు మళ్లీ కబ్జా చేసి, విక్రయించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.సదరు ప్రభుత్వస్థలాల్లో ఇప్పటికే అక్రమంగా నిర్మాణాలు కూడా చేపట్టడం గమనార్హం. ఇంత తతంగం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అసలు రెవెన్యూ ఆధికారులు అలాంటప్పుడు ప్రభుత్వ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు నాటడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

గుర్రంకొండ మండలం చిట్టిబోయనపల్లె ఫ్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులు నాటుతున్న రెవెన్యూ అధికారులు, బోర్డు తొలగించిన దృశ్యం

మళ్లీ మొదలైన కబ్జా యత్నాలు

ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు నాటిన తరువాత గుంభనంగా ఉన్న కబ్జాదారులు మళ్లీ ప్రభుత్వ భూములను కబ్జా చేసే యత్నాలు మొదలు పెట్టారు. బోర్డులు నాటిని భూముల్లో ఉన్న వేప, ఇతర చెట్లను నరికి వేశారు. ఇప్పటికే కొన్ని చెట్లను నేలకూల్చి తరలించేసి భూమిని చదును చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. సదరు భూమిలో చదును చేసే పనుల్లో భాగంగా బయట ప్రాంతాల నుంచి మట్టిని పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. మురాద్‌బీ వంకను చాలా వరకు చదనుచేశారు. వంక రూపురేఖలు మార్చేసి ప్లాట్లు వేసి విక్రయించడానికి సిద్ధం చేశారు. దీంతో ఇక్కడ వంక ఆనవాళ్లు కనుమరుగయ్యాయి.ఇప్పటికే మట్టికుప్పలు భూమిలో దర్శనమిస్తుండడం గమనార్హం. రెవెన్యూ అదికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకొని రోజురోజుకు భూ ఆక్రమణ పనులు మొదలు పెడుతుండటం గమనార్హం.

ప్రభుత్వ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు తొలగించిన సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. చిట్టిబోయనపల్లె, ఖండ్రిగ గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో మళ్లీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం.

– సదాశివప్ప నాయుడు, ఆర్‌ఐ. గుర్రంకొండ.

బోర్డులు పీకేసి..భూములపై కన్నేసి 1
1/2

బోర్డులు పీకేసి..భూములపై కన్నేసి

బోర్డులు పీకేసి..భూములపై కన్నేసి 2
2/2

బోర్డులు పీకేసి..భూములపై కన్నేసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement