కొండలు.. గుట్టలు.. వాగులు.. వంకలు.. ఏవైనా టీడీపీ నాయకుల అక్రమ దోపిడీకి విలవిలలాడుతున్నాయి. ఇసుక, మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తవ్వుకుని.. అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ఏడాదిన్నర పాలనలోనే అక్రమార్కులు ఎంత బరి తెగించారో.. తవ్విన ప్రదేశాల్లో ఏర్పడిన గోతులు చూస్తేనే తెలుస్తోంది. వాటి వద్ద ఎలాంటి రక్షణ చర్యలు లేక ప్రమాదకరంగా మారాయి. గోతుల్లో నీరు నిలవడంతో.. సరదాగా ఈతకు అని దిగిన అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి.
రాయచోటి: నదుల్లో నీటి ప్రవాహం పెరగడంతో పరీవాహక ప్రాంతాలకు సరదాగా ఈత కోసం వెళ్లిన యువతీ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. పచ్చనేతలు తోడేసిన ఇసుక మడుగులు వారిని బలి తీసుకుంటున్నాయి. ఇసుక, మట్టితో పచ్చ నేతలు కోట్ల రూపాయలు ఆర్జిస్తుండగా.. విహార యాత్రలకు, పశువుల కాపర్లుగా వెళ్లిన వారు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇంచుమించు కొంత కాలంగా ఈ తరహా ఘటనలు ప్రధానంగా పెన్నా, బహుదా, చెయ్యేరు, పాపాఘ్ని తదితర నదుల మడుగుల్లో వెలుగు చూస్తున్నాయి. మొన్న నెల్లూరు, చిన్న నంద్యాల ఘటనలు మరువకముందే అన్నమయ్య జిల్లాలోని బహుదా నదిలో ఊబిలను తలపించే మడుగుల్లో.. బంగారు భవిష్యత్తు ఉన్న ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ మధ్యకాలంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని నదులు ప్రవహిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో పచ్చ నేతల కనుసన్నల్లో ఇసుక, మట్టి చోరీకి గురైంది. జిల్లాలోని బహుదా, పింఛా, చెయ్యేరు, పెన్నా, మాండవ్య, పాపాఘ్ని నదుల్లో ఎక్కడ చూసినా బావులు, మడుగులను తలపించేలా గుంతలు కనిపిస్తున్నాయి. సరదా కోసం వెళ్లిన యువతీ యువకుల ప్రాణాలను తీస్తున్నది పచ్చ నేతలు తవ్విన ఇసుక మడుగులేనన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే గురువారం రాజంపేట సమీపంలోని చెయ్యేరు నదిలో అన్నమాచార్య యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సాంబత్తిన దిలీప్ (22), కె.చంద్రశేఖర్(22), పి.కేశవ (22)లు ఇసుక మడుగుల్లో ప్రాణాలు వదిలారు.
నదులు, చెరువులను చెరబట్టిన పచ్చ నేతలు
కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభమైన నాటి నుంచి జిల్లాలోని నదులు, చెరువులలోని ఇసుక, మట్టిని చెరబట్టారు. విచ్చలవిడిగా జేసీబీ, ఈటాచ్, బుల్డోజర్లతో నదీగర్భాన్ని చీల్చి టిప్పర్లు, లారీల సాయంతో ఇసుక, మట్టిని దోచుకెళ్లి నదులు, వాగులు, వంకలు, చెరువులకు గర్భశోకాన్ని మిగిల్చారు. అధికారులు ముందుగా గుర్తించి ఇసుక రీచ్‌లను ఎంపిక చేసిన ప్రాంతాలలో.. మనుషుల సాయంతో ట్రాక్టర్లకు ఎత్తుకుని నదుల నుంచి ఇసుకను తరలించాల్సి ఉంది. రీచ్‌లను అధికార బలంతో దక్కించుకున్న తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి.. యంత్రాలతో విచ్చలవిడిగా తరలించి ధన దాహం తీర్చుకుంటున్నారు.
జాగ్రత్తలు పాటించాలి
ప్రకృతి అందాలు, నదీ ప్రవాహాలు, ప్రాజెక్టుల వీక్షణ లో యాత్రికులు తగు జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటి ప్రమాదాల నివారణకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మృత్యుకుహరాలుగా మారిన గోతులు
ఇసుక, మట్టిని దోచేస్తున్న తమ్ముళ్లు
ప్రమాదకరంగా నదులు,చెరువులు, వాగులు
ప్రాణాలు తోడేస్తున్నారు..!
ప్రాణాలు తోడేస్తున్నారు..!
ప్రాణాలు తోడేస్తున్నారు..!