
24న షూటింగ్‌బాల్ జట్ల ఎంపిక
మదనపల్లె సిటీ: మదనపల్లె పట్టణ సమీపాన ఉన్న పుంగనూరురోడ్డులోని గ్రీన్‌వ్యాలీ పాఠశాలలో ఈ నెల 24న జిల్లా బాల,బాలికల షూటింగ్‌బాల్ జట్ల ఎంపిక జరుగుతుందని జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గౌతమి తెలిపారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ఆమె పేర్కొన్నారు. 2006 ఏప్రిల్ 1 తరువాత పుట్టినవారు అయి ఉండాలన్నారు. ఆధార్‌కార్డు తీసుకుని రావాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ : 6281881022ను సంప్రదించాలని వివరించారు.
రాయచోటి: మాతా శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణలు ఇస్తున్నట్లు డీఐఓ డాక్టర్ ఉషశ్రీ తెలిపారు. రాయచోటిలోని కె.రామాపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లాలోని పీహెచ్‌సీ, యూసీహెచ్‌సీలలో పని చేస్తున్న వైద్యులకు సమీకృత ఎక్కువ ప్రమాదం గల గర్భిణుల జాడను గుర్తించి వారికి సుఖ ప్రసవం నిర్వహించడంపై రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. శుక్రవారం ముగింపు కార్యక్రమానికి డీఐఓ హాజరై మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన వారు జిల్లాలో పని చేస్తున్న వైద్యులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు డాక్టర్ కిజియా, డాక్టర్ లీలా, వైద్యులు పాల్గొన్నారు.
లక్కిరెడ్డిపల్లి: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రామచంద్రారెడ్డి సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండలంలోని కోరంపేట దేవలంపల్లి పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో ఆయన పర్యటించి దోమల నివారణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించేలా గ్రామాల్లో ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్ గున్యా, టైపాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఈయన వెంట సబ్ యూనిట్ ఆఫీసర్ జి.జయరామయ్య, పి.రవీంద్ర, కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ బి.రేఖ నాయక్, డి.దేవాదానం, ఎంపీహెచ్‌ఈఓ, ఆరోగ్య కార్యకర్తలు ఓబులేశు, రాజేంద్ర ప్రసాద్, క్రిస్టపర్వి, బీబీ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రాయచోటి జగదాంబసెంటర్: విద్యార్థుల్లో కళాత్మక నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా 12 అంశాలతో కళా ఉత్సవ్ – 2025 పోటీలు నిర్వహిస్తున్నట్లు కళా ఉత్సవ్ జిల్లా నోడల్ అధికారి మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. స్థానిక డైట్ కళాశాలలో కళా ఉత్సవ్ – 2025కు సంబంధించిన రిజిస్ట్రేషన్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళలు, సంప్రదాయ కథ చెప్పడం వంటి 12 అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి కడప జిల్లాలోని 50 మండలాలకు చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 9, 10, 11, 12వ తరగతుల విద్యార్థులు ఈ పోటీలకు అర్హులని వివరించారు. పోటీల్లో పాల్గొనే వారు రాయచోటి డైట్ కళాశాలలో వ్యక్తిగతంగా గానీ 9440246825 నంబర్‌కు వాట్సాప్ ద్వారా గానీ, గూగుల్ ఫామ్ ద్వారా గానీ తమ పేర్లు నమోదు చేసుకోవాలని వివరించారు.

24న షూటింగ్‌బాల్ జట్ల ఎంపిక

24న షూటింగ్‌బాల్ జట్ల ఎంపిక