
కక్ష.. వివక్ష
వారిపై ఎందుకీ వివక్ష
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చూపించిన ఉదారత ఏ ముఖ్యమంత్రి చూపలేదు. అంతకుముందు పక్కా ఇళ్లు మంజూరు చేసినా ఇంటికి అందించిన యూనిట్ విలువ సొమ్మును ప్రతినెలా తిరిగి కంతుల వారీగా చెల్లించేలా రుణాలు ఇచ్చేవారు. ఒక్కో నియోజకవర్గానికి ఇన్నేసి ఇళ్లే అంటూ రేషన్ కోటాలా ఇళ్లు కేటాయించేవారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక అవసరమైనన్ని గృహాలను మంజురు చేశారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ఈ విధానాలకు స్వస్తి పలికారు. జిల్లాలో 78,221 మందికి పేదలకు పక్కా గృహాలను మంజూరు చేశారు. వీరికి లేఔట్లు, సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించారు. ఒక్కో లబ్ధిదారునికి తిరిగి కట్టనవసరం లేని రూ.1.80 లక్షలు అందించారు. ఇదికాక రుణంగా ఒక్కొక్కరికి రూ.35 వేల రుణం మంజూరు చేయించారు. లేఔట్లలో కోట్లు ఖర్చు చేసి సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ పేదలపై కక్ష కట్టి వ్యవహరిస్తోంది.
● ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్ధిదారులకు ప్రభుత్వం నోటీసులు
● ఇల్లు కట్టకుంటే..మేమిచ్చిన డబ్బువాపసు చేయండంటూ హుకుం జారీ
● ఇళ్లను రద్దు చేస్తామంటూ హెచ్చరికలు
మదనపల్లె: పేదల ఇబ్బందులు తీర్చి, వారికి చేయూత ఇవ్వాల్సిన కూటమి ప్రభుత్వం కక్ష కట్టి వివక్ష చూపుతోంది. బడా పారిశ్రామిక వేత్తలకు, బడా సంస్థకు రెడ్‌కార్పెట్ పరచి వారికి అడిగినవి, అడగని రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం నిరుపేదలు, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంజూరైన ఇళ్లపై కక్ష కట్టింది. అంతటితో ఆగలేదు మీకు మేం డబ్బులిచ్చాం..ఇల్లు కట్టుకోలేదు..వెంటనే ఇంటి పనులు చేపట్టాలి, లేదంటే మేం మీ ఖాతాలకు చెల్లించిన మొత్తాలను తిరిగి చెల్లించండి. తర్వాత ఇంటిని రద్దు చేస్తామంటూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పేదలకు గృహనిర్మాణశాఖ నోటీసులు జారీ చేస్తోంది. వీటిని అందుకున్న పేదలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
అడగకనే పెంచారు
జిల్లాలో 78,221 మందికి పక్కా గృహాలు మంజూరవ్వగా వారిలో 58,070 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గా ల లబ్ధిదారులు ఉన్నారు. ఎస్సీలు 12,188 మంది, ఎస్టీలు 3,432 మంది, బీసీలు 42,450 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యాయి. వీరికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు ఒక్కో లబ్ధిదారునికి అదనంగా మంజూరు చేశారు. ఈ నిధులను సబ్ ప్లాన్ నిధుల నుంచి కేటాయించారు. గుర్తించిన వారికి ఇంటిస్థాయిని బట్టి నిధులను రూ.15వేల నుంచి ఆపైన సొమ్మును వారి ఖాతాలకు జమ చేశా రు. ఇలా అదనపు నిధులను ఇవ్వాలన్న డిమాండ్లు లబ్ధిదారుల నుంచి లేనప్పటికి ప్రభుత్వం ఇచ్చేసింది.
నోటీసులతో అలజడి
మేం మీ ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు ఖాతాకు నిధులు జమ చేశాం, మీరు ఇంటి పనులు చేపట్టలేదంటూ గృహనిర్మాణశాఖ మండల స్థాయిలో సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్స్‌పెక్టర్లు, ఏఈ, ఎంపీడీఓ సంతకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు నోటీసులు పంపుతున్నారు. వీటిని అందుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం తరపున ఎంత మంజూరైంది, అదనంగా ఎంత చెల్లించారో తెలుపుతూ మీరు ఇంటిపని ఇంకా మొదలుపెట్టలేదు. నోటీసు అందిన వారంలోగా పని మొదలుపెట్టకపోతే ప్రభుత్వం వారి తరపున మీకు అందిన డబ్బులను తిరిగి వెన క్కి తీసుకుని, మీకు ఇల్లు అవసరం లేదని భావించి రద్దు చేసేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని మీకు తెలియజేస్తున్నాము అంటూ నోటీసుల్లో హెచ్చరికను జారీ చేశారు. దీంతో ఏం చేయాలో తెలియక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మంజూరైన ఇంటిని రద్దు చేస్తే మళ్లీ ఇళ్లు రావన్న ఆందోళనలో ఉన్నారు. ఇస్తున్న నోటీసులు ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్దిదారులకే ఇవ్వడం విశేషం.
సమస్యను వదిలేసి...
జిల్లాలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్ర మం ద్వారా పేదలకు 78,221 మందికి పక్కా గృహా లు మంజూరయ్యాయి. ఈ నిర్మాణాలు వివిధ స్థా యిల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాక ముందు దాకా ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు వేగంగా జరుపుకున్నారు. కూటమి అధికారంలోకి రావడంతోనే పనుల్లో జాప్యం నెలకొంది. దీనిపై క్షేత్రస్థాయిలో సమీక్షించి నిర్మాణాలపై సరైన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. దీంతో ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ఏటా విధిస్తున్న లక్ష్యాలను అందుకోలేని పరిస్థితి నెలకొంది. అసలు సమస్య ఎక్కడుంది, ఎందుకీ పరిస్థితి నెలకొంది, లబ్ధిదారులకు ఇంకా కల్పించాల్సిన సౌకర్యాలు, తొలగించాల్సిన ఇబ్బందులను విస్మరించింది. దీని ఫలితమే జిల్లాలో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై ప్రభావం చూపుతోంది.
పెద్దతిప్పసముద్రం మండలంలో
మైనార్టీ బీసీ మహిళకు ఇచ్చిన నోటీసు
జిల్లాలో గృహ లబ్ధిదారుల వివరాలు
నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేదల పక్కా గృహాలకు ఇచ్చిన అదనపు నిధులను వెనక్కు తీసుకుంటామని, ఇంటిని రద్దు చేస్తామన్న హెచ్చరికల నోటీసుల అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ వర్గాల్లో అత్యధికులు పేదలే కావడంతో ఇళ్ల నిర్మాణాలపై ప్రభావం కనిపిస్తోంది.
రాయచోటి 2,040 496 11,186 13,722
పీలేరు 2,433 863 10,184 21,436
రాజంపేట 2,308 520 4,770 7,598
కోడూరు 1,897 612 2,306 4,815
తంబళ్లపల్లె 1,579 458 6,051 8,088
మదనపల్లె 1,931 483 7,953 10,367
మొత్తం 12,188 3,432 42,450 58,070

కక్ష.. వివక్ష

కక్ష.. వివక్ష