రాజంపేట: వైఎస్సార్‌సీపీ పురపాలక విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, రాజంపేట పురపాలకసంఘం వైస్ చైర్మన్‌గా మర్రి రవి కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్రకార్యాలయం నుంచి నియామకపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని బుధవారం ఇక్కడి విలేకర్లకు మర్రి రవి తెలిపారు. మర్రి రవి ఎంపికపట్ల కాపు సామాజికవర్గానికి చెందిన పలువురు హర్షం వ్యక్తంచేశారు.
కడప ఎడ్యుకేషన్: డాక్టర్ వైస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఈ నెల 25న కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని విశ్వ విద్యాలయం వీసీ విశ్వనాథకుమార్ తెలిపారు. ఇందులో భాగంగా బీఎఫ్‌ఏ (ఫోర్ ఇయర్స్ డిగ్రీ) ఫైన్ ఆర్ట్స్ (యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, శిల్పం మరియు బి.డెస్ ఇంటీరియర్ డిజైన్) కోర్సులకు కౌన్సిలింగ్ ఉంటుదని వివరించారు. దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో 25వ తేదీ తప్పకుండా హాజరు కావాలని తెలిపారు. ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారు కూడా డైరెక్ట్ అడ్మిషన్స్ కోసం ఒరిజినల్ (అసలు ధృవపత్రాలు) సర్టిఫికెట్స్ తో హాజరు అయి అదే రోజు అడ్మిషన్స్ పొందవచ్చుని తెలిపారు. సమాచాం కోసం www.ysrafu.ac.inను సందర్శించాలని వీసీ విశ్వనాథ్‌కుమార్ తెలిపారు.
రాయచోటి: ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా స్థాయి కళా ఉత్సవ్–2025 పోటీలను రాయచోటి డైట్ ప్రాంగణంలో సెప్టెంబర్ 11, 12వ తేదీల్లో నిర్వహించనున్నట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం తెలిపారు. బుధవారం డైట్‌లో దీనికి సంబంధించిన పోస్టర్లను డీఈఓ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. గాత్ర, వాయిద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళలు, సంప్రదాయ కథ చెప్పడం వంటి విభాగాలలో విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం, కళా రూపాలను ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 9,10, 11,12 తరగతుల విద్యార్థులు పోటీలకు అర్హులను వివరించారు.ఇతర వివరాలకు జిల్లా నోడల్ అధికారి మడితాటి నరసింహారెడ్డి, ఫోన్ నెంబరు. 9440246825లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డైట్ అధ్యాపకులు తిరుపతి శ్రీనివాస్, శివ భాస్కర్, వెంకట సుబ్బారెడ్డి, గిరిబాబు యాదవ్, కేదర్నాథ్, శివప్రసాద్, కలిముల్లా, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు క్రైం: నూతన బార్ పాలసీ ప్రకారం ఇక నుంచి బార్లలో అర్దరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని కడప ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు తెలిపారు. డిప్యూటీ కమిషనర్, ఈఎస్ రవికుమార్ బుధవారం ప్రొద్దుటూరు ఎకై ్సజ్‌స్టేషన్‌కు వచ్చారు. స్థానికంగా ఉన్న పాత బార్ల యజమానులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 41 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపారు. కడప జిల్లాలో 29, అన్నమయ్య జిల్లాలో 12 బార్లు ఉన్నాయన్నారు. ఈ నెల 26లోగా దరఖాస్తులు చేసుకోవాలని, 28న బార్లకు డ్రా తీయనున్నట్లు తెలిపారు. గతంలో ప్రొద్దుటూరులోని బార్లకు లైసెన్స్ ఫీజు రూ. 1.45 కోట్లు ఉండగా ఇప్పుడు రూ. 55 లక్షలకు తగ్గించినట్లు చెప్పారు. సమయ పాలన పాటించని మద్యం షాపులు, బార్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రొద్దుటూరులో గంజాయి అక్రమ రవాణా నిరోధానికి కృషి చేస్తున్న ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డిని అభినందించారు.
నియామకం
నియామకం
నియామకం