
జాతీయ స్థాయి శిక్షణా కార్యశాలకు ఉపాధ్యాయుడి ఎంపిక
చిట్వేలి : శాసీ్త్రయ పారిశ్రామిక పరిశోధనా మండలి వారు జిజ్ఞాస కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా 30 మంది ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో బాగంగా చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఎ.శివనారాయణ గౌడ్ బెంగళూరులోని జాతీయ వైమానిక అంతరిక్ష ప్రయోగశాలలో ఏరో డైనమిక్స్ విమాన విడి భాగాలు, నానో మెటీరియల్స్‌పై రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి సంస్థ డైరెక్టర్, జిజ్ఞాస మోడల్ అధికారి డాక్టర్ వీపీఎస్ నాయుడు ద్వారా సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దుర్గరాజు, ఉపాధ్యాయ సిబ్బంది శివనారాయణ గౌడ్‌ను అభినందించారు.