
పట్టణ శివారు ఇళ్లే టార్గెట్.!
చర్యలు తీసుకుంటాం
● వరుస చోరీలకు పాల్పడుతున్న
దుండగులు
● హడలెత్తిపోతున్న ప్రజలు
గుర్రంకొండ : గుర్రంకొండ పట్టణంలో శివారు ఇళ్లే టార్గెట్‌గా దుండగులు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఓ వైపు గంజాయి ముఠాసభ్యులు మరోవైపు బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తుల సంచారంతో పట్టణ ప్రజలు హడలెత్తిపోతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంకొండ పట్టణం రోజురోజుకు వ్యాపార కేంద్రంగా ఆభివృద్ధి చెందుతోంది. దీంతో స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకొనేవారి సంఖ్య పెరిగిపోతోంది. నాలుగు మండలాల ప్రజలు ఇక్కడ ఇళ్ల కట్టుకొని నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మించుకొంటున్న ఇళ్లతో పాటు గ్రామానికి శివారు ప్రాంతాల్లో నివాసముండే ఇళ్లలో ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. ఇటీవల నిర్మాణంలో ఉండే ఇళ్లలో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంటి నిర్మాణంలో వినియోగించే వస్తువులతోపాటు మెటీరియల్‌ను చోరీ చేసుకువెళుతున్నారు. పట్టణంతో పాటు ఇందిరమ్మకాలనీ, జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం ఉన్న ప్రాంతాల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. మోటార్లు, ఎలక్ట్రికల్ వస్తువులు, గ్రానైట్ యంత్రాలతో పాటు వివిధ రకాల వస్తువులను చోరీ చేస్తున్నారు. దీంతో ఇంటి నిర్మాణం వద్ద వస్తువులు ఉంచాలంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు. దీంతో పలువురు రాత్రిళ్లు కాపలా ఏర్పాటు చేసుకొంటున్నారు. వీటితోపాటు గ్రామ శివారు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకొన్న చోట ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. చిన్న పిల్లల సైకిళ్లు, ఇళ్ల పరిసరాల్లో ఉంచిన వస్తువులను రాత్రిళ్లు చోరీ చేస్తున్నారు. దీంతో రాత్రిళ్లు పట్టణ శివారు ప్రాంతాల్లో సంచరించాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బయటి ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో పాటు గంజాయి మత్తుకు అలవాటు పడిన పలువురు వ్యక్తులు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు. స్థానిక బస్టాండులోనూ ఇటీవల వరుసగా మూడు చిల్లర దుకాణాల్లో చోరీలు జరిగాయి. రేకుల షెడ్లు పైకప్పు రేకులను తొలగించి దుండగులు చోరీలకు పాల్పడ్డారు. ఈ చోరీలకు సంబంధించి పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్ స్టేషన్‌కు చేరని కేసులు ఎన్నో ఉన్నాయి. చోరీలు జరిగినా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు పలువురు భయపడి మిన్నకుండిపోతున్నారు. దీంతో దుండగులు పట్టణంలో యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టణ శివారు ప్రాంతాల్లో జరుగుతున్న చోరీలపై గట్టి నిఘా పెట్టాం. చోరీ జరిగిన ఇళ్లకు సంబంధించిన యజమానులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ఇళ్ల పరిసరాల్లో ఎవరైనా అనుమానితులు సంచరిస్తుంటే మాకు సమాచారం ఇవ్వాలి. – రఘురామ్, ఎస్‌ఐ, గుర్రంకొండ.

పట్టణ శివారు ఇళ్లే టార్గెట్.!

పట్టణ శివారు ఇళ్లే టార్గెట్.!