
నూతన మద్యం పాలసీతో 11 బార్లకు టెండర్లు
రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నూతన మద్యం పాలసీ విధానంలో 11 బార్లకు టెండర్లు వేస్తున్నట్లు అన్నమయ్య జిల్లా ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు. సోమవారం రాయచోటి ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి బార్ కోసం నాలుగు అంత కన్నా ఎక్కువ టెండర్లు వచ్చే విధంగా ఏర్పాటు చేశామని చెప్పారు. అంత కన్నా తక్కువ టెండర్లు వస్తే దానికి సంబధించి లాటరీ తీయబడదన్నారు. 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 28వ తేదీ జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ తీస్తామని తెలిపారు. మదనపల్లె మున్సిపాల్టీలో–5, రాయచోటి మున్సిపాల్టీలో–3, రాజంపేట మున్సిపాల్టీలో–2, పీలేరు టూరిజం సెంటర్‌లో–1 చొప్పున ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ప్రతి బార్‌కు రూ.5లక్షలు అప్లికేషన్ ఫీజుతో పాటు రూ.10 వేలు ప్రాసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మొత్తాన్ని ఎలాంటి పరిస్థితిలో తిరిగి వెనక్కు ఇవ్వరన్నారు. బార్లు మూడు సంవత్సరాల పాటు నిర్వహించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ గురుప్రసాద్ పాల్గొన్నారు.