
ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర అమలు చేయాలి
రాజంపేట రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్రను అమలు చేసి ఆటో డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకోవాలని ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్సార్ సర్కిల్ పాత బస్టాండు వద్ద సోమవారం ఆటో డ్రైవర్లతో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణ పేరుతో 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన నూతన మోటారు చట్టం 106(1)(2)ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు, మోటారు కార్మికులకు రూ.15వేలు అందించే వాహనమిత్ర పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 20న సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ నాయకులు సురేష్, నాయక్, ఆకాష్, హరీ, నరసింహ, మహమ్మద్ పాల్గొన్నారు.