
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
మదనపల్లె రూరల్ : ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. బసినికొండకు చెందిన ఇమామ్‌బాషా కుమారుడు షేక్ చాంద్‌బాషా(65) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పొలం దున్నేందుకు ట్రాక్టర్ తీసుకుని స్థానికంగా ఓ యజమాని పొలంలో పనిచేసేందుకు వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా, ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ట్రాక్టర్‌లో నుంచి రోడ్డుపక్కనే ఉన్న కుంటలో పడిన చాంద్‌బాషా నీట మునిగి మృతిచెందాడు. అయితే, పనులకు వెళ్లిన చాంద్‌బాషా ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించడంతో నీటికుంటలో బయటపడ్డాడు. దీంతో మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులును విచారించగా తమకు ఫిర్యాదు అందలేదన్నారు.
అవినీతి ఆరోపణలపై విచారణ
ఓబులవారిపల్లె : చిన్న ఓరంపాడు జేఎల్‌ఎం ఖలీల్‌పై గ్రామ రైతులు చేసిన అవినీతి ఆరోపణలపై సోమవారం రైతులతో విద్యుత్ శాఖ విజిలెన్సు అధికారులు విచారణ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ విజిలెన్స్ ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విచారణ నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.
చోరీ జరిగిన ఇంట్లో
క్లూస్ టీమ్ తనిఖీలు
గాలివీడు : మండల కేంద్రమైన గాలివీడులోని గౌతమ్ పాఠశాల వద్ద ఆటో డ్రైవర్ మల్లయ్య ఇంట్లో జరిగిన రూ.3 లక్షలు నగదు,12 తులాల బంగారం చోరీకి సంంధించి సోమవారం క్లూస్ టీమ్ సభ్యులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక బృందం స్థానిక ఎస్‌ఐ రామకృష్ణతో కలిసి దొంగల జాడ కోసం చోరీ జరిగిన ఇంటిని జల్లెడ పట్టారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, చోరీపై గల సందేహాలను కుటుంబ సభ్యులను అడిగి ఆరా తీశారు.
లారీ ఢీ కొని యువకుడి మృతి
చాపాడు : మైదుకూరు–ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని కేతవరం గ్రామ సమీంపలో సోమవారం లారీ ఢీ కొని మండలంలోని కేతవరం గ్రామానికి చెందిన ఎల్లనూరు సునీల్‌కుమార్(31)అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు సునీల్ కుమార్ ఉదయం కేఏ01ఏవీ 8756 నెంబరు గల బైక్‌లో మైదుకూరుకు వెళుతుండగా ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తున్న టీఎల్ 88జే 2621 నెంబరు గల లారీ బైక్‌ను ఢీ కొంది. సునీల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి

ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి