
మహిళల ఉచిత ప్రయాణానికి 8400 బస్సులు
పీలేరురూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా 129 డిపోలలో సీ్త్ర శక్తి పథకంలో భాగంగా 8400 బస్సు సర్వీసులు మహిళ ఉచిత ప్రయాణానికి నడుపుతున్నట్లు విజయవాడ ఆర్టీసీ మెకానికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టి. చెంగల్‌రెడ్డి అన్నారు. ఆదివారం అన్నమయ్య జిల్లా పీలేరులోని ఆర్టీసీ గ్యారేజ్‌లో బస్సుల కండీషన్‌ను పరిశీలించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నరు. ఈ కార్యక్రమంలో డీఎం బి. నిర్మల, సీఐ ధనుంజయలు, గ్యారేజ్ ఎంఎఫ్ హరినాథరెడ్డి, బస్టేషన్ మేనేజర్ బాబునాయక్, రెడ్డెప్ప, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఈడీ టి. చెంగల్‌రెడ్డి