
ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
రాయచోటి జగదాంబసెంటర్: సూపర్‌సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (సీ్త్ర శక్తి) హామీ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాయచోటి బస్టాండు ప్రాంగణంలో మంత్రి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్‌తో కలిసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సూపర్‌సిక్స్ హామీల్లో భాగంగా సీ్త్ర శక్తి పథకం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఆధార్, రేషన్‌కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి చూపించి కండక్టర్ జారీ చేసే జీరో ఫేర్ టికెట్‌తో ప్రయాణించవచ్చన్నారు. ఆర్టీసీలోని మొత్తం 8,458 బస్సుల్లో మహిళలు, యువతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ ఉచిత ప్రయాణ సీ్త్ర శక్తి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేసిందన్నారు. ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను సూచించారు. మహిళా ప్రయాణికుల పట్ల సంస్థ ఉద్యోగులు మర్యాద పూర్వకంగా ఉండాలన్నారు. సిబ్బందితో ఆర్టీసీ అధికారులు సమావేశం నిర్వహించి జాగ్రత్తగా విధులు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్, డిపో మేనేజర్ రాము తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి