
గోవిందమాంబకు సారె సమర్పణ
బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠంలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ధర్మపత్ని గోవిందమాంబకు శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం చీర, సారె, పసుపు, కుంకుమలను సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ బ్రహ్మిణి సేవాసమితి కడప నిర్వాహకురాలు అంకిరెడ్డిపల్లె రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి కరుణాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. తోట్లపల్లె అచలానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీ విరజానందస్వామి, నొస్సం వీరభద్రస్వామి పాల్గొన్నారు. మహిళా భక్తులు మఠం పురవీధులలో చేపట్టిన కోలాటం ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎస్సార్ శ్రీనివాసులరెడ్డి, నారాయణరెడ్డి, ఈవీ రమణారెడ్డి, శేగినేని పోతులూరయ్య పాల్గొన్నారు.