
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
కురబలకోట: మండలంలోని గడ్డెత్తుపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు దేవరింటి శివ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. పెద్ద దిక్కు మృతి చెందడంతో.. ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. శివకు చిన్నపిల్లలు ఉన్నారు. వీరి చదువుల కోసం ఆదుకుంటానని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం రూ.2 లక్షలు అందించారు. ఈ ఆర్థిక సాయాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, డీఆర్ ఉమాపతిరెడ్డి, కన్వీనర్ మధుసూధన్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు, ఆర్సీ ఈశ్వర్‌రెడ్డి, సోమిరెడ్డి, ఎంపీటీసీ ఆనందరెడ్డి, ప్రకాష్ రెడ్డి, రాజశేఖర్, అశోక్, సుధీర్‌రెడ్డి తదితరుల ద్వారా అందజేశారు. శివ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.