
మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుందాం
– కలెక్టర్ శ్రీధర్ ఛామకూరి
రాయచోటి : దేశ స్వాతంత్య్రం కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడలలో నడవాలని కలెక్టర్ ఉపదేశించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఛామకూరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు కలెక్టర్ మిఠాయిలు పంచి పెట్టారు.
మహాత్మాగాంధీకి నివాళులు
రాయచోటి : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిపిత మహాత్మగాంధీ విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ఉన్న గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
హౌసింగ్ ఇన్‌చార్జ్ డీఈకి ప్రశంసాపత్రం
మదనపల్లె రూరల్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి చేతుల మీదుగా హౌసింగ్ ఇన్‌చార్జ్ డీఈ దీనదయాళ్‌రాజు ఉత్తమ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. శుక్రవారం రాయచోటిలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో హౌసింగ్ పీడీ రమేష్‌రెడ్డి సమక్షంలో డీఈ దీనదయాళ్‌రాజు పురస్కారాన్ని అందుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడు మృతి
జమ్మలమడుగు : ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి గ్రామం నుంచి బుల్లెట్‌పై ప్రొద్దుటూరుకు వెళ్తుతున్న ఫయాజ్(25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం పని నిమిత్తం ఫయాజ్ ప్రొద్దుటూరుకు వెళుతుండగా మణిపూర్‌కు చెందిన గీతా సర్కస్‌కు చెందిన ముగ్గురు స్నేహితులు స్కూటర్‌లో ఎదురుగా వస్తుండటంతో ఆదుపు చేయలేక బుల్లెట్ టీవీఎస్ ఢీకొన్నాయి.