ముస్లింలకు వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు | YSRCP President YS Jagan Bakrid Wishes To Muslims | Sakshi
Sakshi News home page

ముస్లింలకు వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

Jun 6 2025 7:16 PM | Updated on Jun 7 2025 8:12 AM

YSRCP President YS Jagan Bakrid Wishes To Muslims

తాడేపల్లి :  ముస్లిం సోదర, సోద­రీ­­మ­ణు­లకు వైఎస్సా­ర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభా­కాంక్షలు తెలిపారు. త్యాగాల పండగ బక్రిద్‌ కాగా, త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్‌ పండగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్‌ పండుగ జరుపుకుంటారని, త్యాగనిరతికి  ఈ పండుగ నిదర్శమన్నారు. 

ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని, అల్లాహ్‌ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement