
సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్‌లో గిరిజన బాలికలను వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు. పచ్చ కామెర్లకు చికిత్స పొందుతున్న బాలికలను ఆ పార్టీ నేతలు పుష్పశ్రీవాణి, రాజన్నదొర, ఎంపీ తనూజారాణి, మజ్జి శ్రీను పరామర్శించి.. బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను వారు కోరారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇద్దరు బాలికలు చనిపోయారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. బాలికల అస్వస్థతకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. కురుపాం గిరిజన హాస్టల్లో సమస్యలున్నాయని మేం ముందే చెప్పాం. ఈ నెల 1న బాలికలు అస్వస్థతకు గురైతే 5న మంత్రి వచ్చారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా?’’ అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు.