ఐఐఎంవీలో సమారంభ్‌ 10.0 ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఐఐఎంవీలో సమారంభ్‌ 10.0 ప్రారంభం

Feb 28 2026 7:07 AM | Updated on Feb 28 2026 7:07 AM

ఐఐఎంవీలో సమారంభ్‌ 10.0 ప్రారంభం

ఐఐఎంవీలో సమారంభ్‌ 10.0 ప్రారంభం

తగరపువలస: ఆనందపురం మండలం గంభీరంలోని ఐఐఎం విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరగనున్న 10వ వార్షిక సాంస్కృతిక ఉత్సవం ‘సమారంభ్‌ 10.0’శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ‘మిలీనియం డ్రీమ్‌ల్యాండ్‌’ థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక పోటీలు, సంగీత విభావరి క్యాంపస్‌లో సందడి నింపాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అచీవర్స్‌ అవార్డులను ప్రదానం చేశారు. విద్యా రంగంలో ఆర్యాకి పాఠక్‌, క్రీడల్లో మహేంద్ర పటేల్‌, ఆల్‌రౌండ్‌ ఎక్స్‌లెన్స్‌లో ఇయోన్స్‌ చెరియన్‌లు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. విజేతలకు ఒక్కొక్కరికి రూ.31,000 చొప్పున నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో ఐఐఎంవీ స్టూడెంట్‌ అఫైర్స్‌ మేనేజర్‌ రాయప్రోలు రాము, రీసెర్చ్‌ డీన్‌ అమిత్‌ శంకర్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా డిప్యూటీ రీజనల్‌ హెడ్‌ సతీష్‌, వేములవలస బ్రాంచ్‌ మేనేజర్‌ సంపత్‌ కుమార్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌ తేజ, క్రెడిట్‌ కార్డు డివిజన్‌ ప్రతినిధి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలు శనివారం ముగియనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement