సింహాచలం బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ.. రెండు లక్షలు అందజేత | YSRCP Leaders Given Two Lacks To simhachalam victims | Sakshi
Sakshi News home page

సింహాచలం బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ.. రెండు లక్షలు అందజేత

May 7 2025 12:50 PM | Updated on May 7 2025 3:11 PM

YSRCP Leaders Given Two Lacks To simhachalam victims

సాక్షి, విశాఖ: సింహాచలం గోడ కూలి మరణించిన వారి కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. వైఎస్సార్‌సీపీ తరఫున బాధితులకు రెండు లక్షల పరిహారం ప్రకటించింది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, మజ్జి చిన్న శ్రీను, కేకే రాజు.. రెండు లక్షలు అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ..‘చనిపోయిన ప్రతి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెండు లక్షల ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు అందించాము. సింహాచలం కొండపై ప్రమాదానికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఎండోమెంట్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. 

దేవాలయాలలో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగింది. ఐదుగురు మంత్రులతో కమిటీ వేసి ఏడుగురి ప్రాణాలు తీశారు. దేవాలయాలకు వెళ్లలంటేనే భక్తులు భయపడే పరిస్థితులు తీసుకువచ్చారు. కూటమి పాలన తీరుతో భక్తులు భయపడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. 

మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్ సింహాచలం బాధితులకు ఆర్థిక సాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement