దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి | YSRCP leaders Avinash Vishnu and Anji Reddy lodge a complaint with the Cyber ​​Crime police | Sakshi
Sakshi News home page

దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి

Nov 13 2026 4:44 AM | Updated on Nov 13 2026 4:44 AM

YSRCP leaders Avinash Vishnu and Anji Reddy lodge a complaint with the Cyber ​​Crime police

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు  

సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు వైఎస్సార్‌ సీపీ నేతలు అవినాష్, విష్ణు, అంజిరెడ్డి ఫిర్యాదు   

లబ్బీపేట (విజయవాడ తూర్పు): ‘మీకు దమ్మూ, ధైర్యం ఉంటే వైఎస్‌ జగన్‌ను నేరుగా ఎదుర్కోండి. అంతేగానీ రాజకీయాల్లోకి రాని మహిళల గురించి దారుణంగా మాట్లాడటం ఏమిటి?’ అని వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులను ఉద్దేశించి ‘ఎక్స్‌’లో జనసేన నేతలు మాట్లాడిన మాటలు అత్యంత దారుణమని మండిపడ్డారు. 

దీనిపై పూర్తి ఆధారాలతో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ సోషల్‌ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్‌ ప్రెసిడెంట్‌ దొడ్డా అంజిరెడ్డితో కలిసి విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అవినాష్‌ గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం అవినాష్‌ మీడియాతో మాట్లాడుతూ.. పూర్తి ఆధారాలు అందజేశామని, బాధ్యులను అరెస్టు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. ఆ కార్యక్రమాన్ని హోస్ట్‌ చేసిన వారి వివరాలు మొత్తం ఇచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తంచేశారు.   

24 గంటల్లో చర్యలు తీసుకోవాలి 
తమ ఫిర్యాదుపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోకుంటే యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తామని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మహిళలపై అనేక దారుణాలు జరుగుతున్నాయన్నారు. రాప్తాడులో విద్యార్థినిపై జరిగిన దారుణం అందరూ చూశారన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement