టీడీపీ మహానాడు అట్టర్ ప్లాప్‌.. అనంతపురం బహిరంగ సభలో మంత్రులు

YSRCP Bus Yatra: Samajika Bhari Public Meeting In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర అనంతపురం చేరుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు పాల్గొన్నారు.

సభలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో టీడీపీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందాయని.. వైఎస్‌ జగన్ పాలనలో కులాలు, పార్టీ లకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారు. మహానాడు అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. ‘‘సీఎం జగన్‌ను ఎందుకు క్విట్ చేయాలి?. అమ్మ ఒడి ఇస్తున్నందుకా?. రైతు భరోసా ఇస్తున్నందుకా?. వైఎస్సార్ చేయూత ఇస్తున్నందుకా?’’ అని మంత్రి ప్రశ్నించారు. జగనన్న ముద్దు.. చంద్రబాబు వద్దు అన్న నినాదంతో ముందుకెళ్లాలని’’ మంత్రి వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు.

చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి: అంజాద్‌ బాషా
అణగారిన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. కేబినెట్‌లో 74 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అవకాశం కల్పించారన్నారు. ప్రతి సంక్షేమ పథకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేశారన్నారు. ‘‘పేదలకు పూర్తిస్థాయి న్యాయం చేయగలిగిన నాయకుడు సీఎం జగన్‌ అన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని’ అంజాద్‌ బాషా అన్నారు.

టీడీపీది.. నయవంచక మహానాడు: నారాయణ స్వామి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారని మంత్రి నారాయణస్వామి అన్నారు. ‘‘టీడీపీది మహానాడు కాదు.. వెన్నుపోటు నాడు, దగా నాడు.  టీడీపీది జరిపింది నయవంచక మహానాడు’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. నవరత్నాల పథకాలతో సీఎం జగన్‌.. పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చారన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కలేనన్నారు. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని నారాయణ స్వామి అన్నారు.

బలహీనవర్గాలకు రాజ్యాధికారం: ఉషాశ్రీ చరణ్‌
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్‌దేనని మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు. చరిత్రలో లేని విధంగా బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా సీఎం జగన్‌ పాలన చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ పాలనలోనే అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు.

టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ: ఆర్‌ కృష్ణయ్య
సీఎం జగన్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోమోగుతోందని బీసీ నేత ఆర్‌. కృష్ణయ్య అన్నారు. దేశంలో ఎక్కడా లేని సామాజిక న్యాయం ఏపీలో జరుగుతోందన్నారు. టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ. చంద్రబాబు మాటల్లోనే బీసీలపై ప్రేమ చూపించారు. బీసీలపై ప్రేమను సీఎం జగన్‌  చేతల్లో చూపుతున్నారు. ఇతర  రాష్ట్రాలకు ఆదర్శంగా సీఎం జగన్‌ పాలన చేస్తున్నారని కృష్ణయ్య అన్నారు.

ఏపీలో విప్లవాత్మక సంస్కరణలు: ధర్మాన ప్రసాదరావు
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిందని.. ప్రభుత్వ కార్యక్రమాలు వివరించేందుకు ప్రజల్లోకి వచ్చామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 17 మందికి మంత్రి పదవులు ఇవ్వడమే కాదు. కీలకమైన పోర్టు పోలియోలు అప్పగించారన్నారు. అధికారంలోకి రాక ముందు వైఎస్‌ జగన్‌ రాష్ట్రమంతా పర్యటించారు. రాష్ట్ర స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. స్థితిగతులు పరిశీలించాక విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారన్నారు. నాడు-నేడు పథకం ద్వారా బడులు రూపు రేఖలు మార్చారని మంత్రి ధర్మాన అన్నారు.

ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా?: జోగి రమేష్‌
బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీలకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పే  ధైర్యం చంద్రబాబుకు ఉందా అని మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు. సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. మరో 30 ఏళ్లు పాటు వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉండాల్సిన అవసరముందన్నారు. బస్సు యాత్రపై ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ పేదల పక్షపాతి అని మంత్రి జోగి రమేష్‌ అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top