వైఎస్సార్ అనే పేరులో ఒక వైబ్రేషన్ ఉంది

YSR Name Have Vibration Says Kurasala Kannababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ అనే పేరులో వైబ్రేషన్‌ ఉందని, ఆయన పేరుతో క్రికెట్‌ పోటీలు నిర్వహించటం సంతోషంగా ఉందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఈ పోటీలు చరిత్రలో నిలిచిపోతాయని అభిప్రాయపడ్డారు. సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా విశాఖలో వైఎస్సార్ క్రికెట్ కప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ విజయసాయిరెడ్డి కాగడ వెలిగించి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కురసాల కన్నబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకలు ఇంట్లో మనిషి జన్మదినంగా చేసుకున్నారన్నారు. ఈ పోటీలు వైఎస్సార్ సీపీ కార్యకర్తల కోసం పెట్టలేదని, క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ బైటకు తీయడం కోసం పెట్టారని స్పష్టం చేశారు. ( వైఎస్సార్‌ సీపీ శ్రేణుల రక్తదానం: గిన్నిస్‌ రికార్డు)

క్రీడల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది : మంత్రి అవంతి
‘‘ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైఎస్సార్ క్రికెట్ కప్ పోటీలు పెడుతున్నాము. క్రికెట్ పోటీల వలన యువతలో ఉన్న నైపుణ్యం బైట పడుతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top