వైఎస్సార్‌ సీపీ శ్రేణుల రక్తదానం: గిన్నిస్‌ రికార్డు బ్రేక్‌

Blood Camp On CM YS Jagan Birth Day Beats Guiniss World Records - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణుల రక్తదాన శిబిరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రక్తదాన కార్యక్రమం అత్యంత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దాదాపు 175 నియోజకవర్గాలో పార్టీ శ్రేణులు చేపట్టిన రక్తదానం 18 వేల యూనిట్లను దాటి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును బద్ధలు కొట్టింది. గతంలో రక్తదానంలో 10,500 యూనిట్లుగా ఉన్న గిన్నిస్ రికార్డ్‌ను తుడిచిపెట్టింది. ప్రస్తుత ఈ రికార్డ్‌ను వండర్ బుక్ ఆఫ్‌ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నమోదు చేసుకుంది. ( సీఎం జగన్‌ బర్త్‌డే: 20వేల మందితో భారీ ర్యాలీ )

కాగా, సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు సందర్బంగా సాక్షి టీవీలో ఆవిష్కరించిన ప్రత్యేక పాట ‘ఒక నిజం జన్మించిన రోజు.. ఒక తేజం ఉదయించిన రోజు.. పుట్టినరోజు జగనన్న పుట్టినరోజు’ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పాట వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి నేటి వరకు ఆయన చేపట్టిన కార్యక్రమాలు, అందించిన సంక్షేమ పాలన, సాధించిన ఘనతను కీర్తిస్తూ కొనసాగుతుంది.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ నేపథ్యంలో ల్యాబ్‌ల్లో బ్లడ్ కొరత కనిపించిందని, అందుకే రక్తదానం పెద్దఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చామని తెలిపారు.4వేల యూనిట్లకు పడిపోయిన దశలో 34వేల యూనిట్లకు పైగా అందించాం. సేవా కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ ముందు ఉంటుందని పేర్కొన్నారు. పదేళ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పార్టీ శ్రేణులు రక్తదానం చేశారని పేర్కొన్నారు. వండర్‌ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌లో నిలవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్‌పై అభిమానంతో ప్రజలు కూడా రక్తదానం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top