Bharath Bandh వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు; ఆ సమయంలో బస్సులు తిరగవు

YSR Congress Party Full Support To Bharat Bandh - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్‌ బంద్‌కు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్‌లో భాగంగా 26వ తేదీ అర్ధరాత్రి నుంచి 27వ తేదీ 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు నడవవు. ఆ తర్వాత నుండి బస్సులు యధావిధిగా తిరుగుతాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని మంత్రి పేర్ని నాని తెలిపారు.

రైతు సంఘాలు శాంతియుతంగా బంద్‌లో పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దని, రైతు చట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్రాన్ని కోరుతున్నాం’ అని పేర్ని నాని విన్నవించారు.

చదవండి: (26న ‘గులాబ్‌’ తుఫాన్‌.. నేడు, రేపు భారీ వర్షాలు) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top