తుపాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పెనమలూరు సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు.
మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను వైఎస్ జగన్ పరిశీలించి.. రైతులతో మాట్లాడతారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
