ఆదర్శప్రాయుడు శ్రీరాముడు: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Tweet On The Occasion Of Sri Rama Navami 2026 | Sakshi
Sakshi News home page

ఆదర్శప్రాయుడు శ్రీరాముడు: వైఎస్‌ జగన్‌

Mar 27 2026 9:06 AM | Updated on Mar 27 2026 12:19 PM

Ys Jagan Tweet On The Occasion Of Sri Rama Navami 2026

సాక్షి, తాడేపల్లి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైవెస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి.. వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement