
సాక్షి, అమరావతి: పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘జాతీయ జెండా రూపకర్త, తెలుగు జాతి ముద్దు బిడ్డ పింగళి వెంకయ్య గారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
భారతదేశ జాతీయ పతాక రూపకర్త, తెలుగు జాతి ముద్దు బిడ్డ పింగళి వెంకయ్య గారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/lqErkr2l3P
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2025