
సాక్షి, తాడేపల్లి: నేడు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. భగత్‌సింగ్‌కు నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణ త్యాగం చేసి.. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ యువతలో దేశభక్తి జ్వాలలు రగిలించిన వీరుడు భగత్ సింగ్. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు అని పోస్టు చేశారు.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణ త్యాగం చేసి, "ఇంక్విలాబ్ జిందాబాద్" అంటూ యువతలో దేశభక్తి జ్వాలలు రగిలించిన వీరుడు భగత్ సింగ్ గారు. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/GfvCOMLhTv
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2025