సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. నిరాడంబరత, నిజాయితీ, ప్రజా జీవితంలో ఉన్నత విలువలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు రోశయ్య అని కొనియాడారు. నాన్నగారు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మరువలేరని పేర్కొన్నారు. రోశయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
నిరాడంబరత, నిజాయితీ, ప్రజా జీవితంలో ఉన్నత విలువలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారు. నాన్నగారు.. దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. రోశయ్యగారి జయంతి… pic.twitter.com/3QiLGyS4tD
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2026


