క‌రోనా నియంత్ర‌ణ‌లో క‌లెక్ట‌ర్ల‌దే కీల‌క పాత్ర‌: సీఎం జ‌గ‌న్‌ | YS Jagan Mohan Reddy Orders To Collectors On Coronavirus Control | Sakshi
Sakshi News home page

క‌రోనా నియంత్ర‌ణ‌లో క‌లెక్ట‌ర్ల‌దే కీల‌క పాత్ర‌: సీఎం జ‌గ‌న్‌

Apr 25 2021 4:12 PM | Updated on Apr 25 2021 4:29 PM

YS Jagan Mohan Reddy Orders To Collectors On Coronavirus Control - Sakshi

సాక్షి, అమ‌రావ‌తి: క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో క‌లెక్ట‌ర్ల‌దే కీల‌క పాత్ర అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. క‌లెక్ట‌ర్లు వ్య‌క్తిగ‌తంగా కోవిడ్ ఆసుప‌త్రుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించాల‌న్నారు. జిల్లాలో శానిటైజేష‌న్ చేయ‌డం, మాస్క్‌లు ధ‌రించ‌డం స‌హా భౌతిక‌దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కలెక్టర్లను ఆదేశించారు. 104కు కాల్ చేసే ప్ర‌తి ఒక్క‌రూ సంతృప్తి చెందే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. కోవిడ్ సంక్షోభంలో క‌లెక్ట‌ర్లు అత్యుత్త‌మ ప‌నితీరు క‌న‌బ‌ర్చాల‌ని తెలిపారు.

చ‌ద‌వండి: వ్యాక్సిన్‌కు అర్హులు 3.48 కోట్ల మంది

Advertisement
 
Advertisement
Advertisement