పాశ్వాన్‌ మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం | YS Jagan Mohan Reddy Condolense To Ram vilas paswan | Sakshi
Sakshi News home page

పాశ్వాన్‌ మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం

Oct 8 2020 9:47 PM | Updated on Oct 8 2020 10:03 PM

YS Jagan Mohan Reddy Condolense To Ram vilas paswan - Sakshi

సాక్షి, అమరావతి : కేంద్ర మంత్రి రామ్‌ విలాస్ పాశ్వాన్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంతో ఉన్న దళిత నాయకుడు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌ఎస్‌పి) చీఫ్ అణగారిన వర్గాలవారిపట్ల గొంతుకగా నిలిచారన్నారు. ఆయన మృతి దేశ రాజకీయాలలో తీరని లోటుగా మిగిలిపోనుందన్నారు.ఈ సందర్భంగా పాశ్వాన్‌ కుటుంబసభ్యులకు తన ప్రగాడ సానుభూతి ప్రకటించారు. (చదవండి : కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌‌ కన్నుమూత)

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మృతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాజకీయ నాయకుడిగా సామాజిక ఉద్యమ కారుడిగా పాశ్వాన్ కు భారత రాజకీయ చరిత్రలో గొప్ప స్థానం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పాశ్వాన్ మృతి పట్ల పార్టీ కార్యకర్తలకు, ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement