రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ | Ys Jagan Meeting With Ysrcp Local Bodies Leaders In The United Kurnool District | Sakshi
Sakshi News home page

ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ భేటీ

Apr 9 2025 9:11 PM | Updated on Apr 9 2025 9:39 PM

Ys Jagan Meeting With Ysrcp Local Bodies Leaders In The United Kurnool District

తాడేపల్లి,సాక్షి: రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీ ఉప ఎన్నికల్లో  పార్టీ కోసం పని చేసిన నేతలతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు ఉమ్మడి కర్నూలు జిల్లా (కర్నూలు, నంద్యాల జిల్లాలు) వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో  భేటీ కానున్నారు.  

 ఈ సమావేశానికి మేయర్‌, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు,మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, వైస్‌ ఛైర్మన్‌లు, మండల ప్రెసిడెంట్‌లు హాజరు కానున్నారు. వీరితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు,పార్టీ ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement