సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 9న (బుధవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
వారితో అక్కడ పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.


