YS Jagan Expresses Grief Over Death Of Minister Gowtahm Reddy - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Published Mon, Feb 21 2022 10:36 AM

YS Jagan Expresses Grief Over Death Of Minister Gowtahm Reddy - Sakshi

సాక్షి, అమరావతి: తనకు ఆతీ్మయుడైన మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత విషాదకరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. మేకపాటి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. గౌతమ్‌రెడ్డి తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడని గుర్తు చేసుకున్నారు. ఈమేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషాద ఘటన గురించి తెలిసిన వెంటనే హైదరాబాద్‌ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, సీఎం కార్యదర్శులు సాల్మన్‌ ఆరోఖ్యరాజ్, రేవు ముత్యాలరాజు, ధనుంజయ్‌రెడ్డి తదితరులతో సమావేశమయ్యారు. 

చిన్ననాటి నేస్తం.. 
చిన్ననాటి నుంచే గౌతమ్‌రెడ్డి తనకు బాగా పరిచయమని, ఒక స్నేహితుడినే కాకుండా సమర్థుడైన మంత్రి, విద్యాధికుడ్ని కోల్పోయానని సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారంటూ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం, వాణిజ్యం, ఐటీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, పారదర్శక విధానాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రానికి మంచి గుర్తింపు తెచ్చారని తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు కలిగిన నాయకుడిని కోల్పోయానని చెప్పారు. ఆయన మృతి చెందడం వ్యక్తిగతంగా తనకే కాకుండా రాష్ట్రానికి తీరని లోటన్నారు.  

చదవండి: తండ్రికి తగ్గ తనయుడు.. ఒకే ఒక్కడు..

రెండు రోజులు సంతాప దినాలు 
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. సోమ, మంగళ వారాలు సంతాప దినాలుగా పాటించాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సంతాప దినాల సమయంలో ఎలాంటి ప్రజా వినోద కార్యక్రమాలను నిర్వహించరాదని స్పష్టం చేశారు. అధికార లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.   

జీర్ణించుకోలేకపోతున్నాం 
పదేళ్ల ప్రయాణంలో సొంత తమ్ముడిలా, కుటుంబ సభ్యుడిలా ఉండే గౌతమ్‌రెడ్డి అకాలమరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. నాలాగే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోని వారందరూ తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లు బాధపడుతున్నారు. రాజమోహన్‌రెడ్డి పారీ్టకి పెద్దదిక్కుగా ఉంటూ, తన బిడ్డను పారీ్టకి అప్పగించారు. బిజినెస్‌లో ఎంతో విజయవంతమైన వ్యక్తి రాజకీయాల్లోనూ అంతే ఉన్నతంగా ప్రభుత్వానికి గర్వకారణంగా నిలిచారు. సీఎంకు గౌతంరెడ్డి చిన్ననాటి నుంచీ అత్యంత సన్నిహితుడు. బుధవారం బ్రాహ్మణపల్లెలో జరిగే గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు సీఎం హాజరవుతారు.  
– సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు 

సోదరుడిని కోల్పోయాం 
సోదరుడిని కోల్పోయిన బాధ నన్ను కలచివేస్తోంది. గౌతమ్‌రెడ్డితో నాకు 12 ఏళ్ల పరిచయం ఉంది. ఎన్నో సందర్భాల్లో రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలాసార్లు కలిశాం. ఆయన చిన్న వయసులో వెళ్లిపోయారనే వార్త వినగానే షాక్‌కు గురయ్యాను. ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకుడు. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి విషాద పరిస్థితుల్లో వారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది.  
– కల్వకుంట్ల తారకరామారావు, తెలంగాణ ఐటీశాఖ మంత్రి  

ఎంతో సౌమ్యుడు 
గౌతమ్‌రెడ్డి  సౌమ్యుడు, సంస్కారవంతుడు. నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయన చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం. గౌతమ్‌ తాతగారి కాలం నుంచి నాకు వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది.  గౌతమ్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా. 
– ట్వీట్‌లో వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి 

చిన్న వయసులో మరణించడం బాధాకరం
 యువ, డైనమిక్‌ మంత్రిగా గౌతమ్‌రెడ్డి తన బాధ్యతను విధిగా నిర్వర్తించారు. అటువంటి వ్యక్తి ఇంత చిన్న వయసులో మరణించడం చాలా బాధాకరం. గౌతమ్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. 
– విశ్వభూషణ్‌ హరిచందన్, గవర్నర్‌  

ఎదిగినా ఒదిగి ఉండే మనిషి 
మంత్రి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణాన్ని జీరి్ణంచుకోలేకున్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఆయన సొంతం. యువతకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకం.  
– తమ్మినేని సీతారాం, శాసనసభ స్పీకర్‌ 

తీవ్రంగా కలచి వేసింది
మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం తీవ్రంగా కలచివేస్తోంది.  రాష్ట్ర పారిశ్రామిక, నైపుణ్యాభివృద్ధికి సమర్థంగా కృషిచేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులు తెచి్చపెట్టారు.  
– ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం  

అందరితో ఆప్యాయంగా..
ఎంతో సౌమ్యంగా అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. ఎంతో దృఢంగా ఉండే ఆయన చిన్నవయసులో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 
– పాముల పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి 

నిగర్వి, స్నేహశీలి
నిగరి్వ, స్నేహశీలి. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా అన్నా అంటూ పలకరిస్తూ ఉండేవారు. ప్రజల మన్ననలు పొందిన నాయకుడు దూరమవడం చాలా బాధాకరం.  
– అంజాద్‌బాషా, ఉప ముఖ్యమంత్రి 

ఎంతో పరిశ్రమించారు.. 
ఏపీలో పెట్టుబడుల కోసం పరిశ్రమలు, ఐటీ మంత్రిగా గౌతమ్‌రెడ్డి ఎంతో శ్రమించారు. నిన్నటివరకు కూడా రాష్ట్రాభివృద్ధి కోసం దుబాయ్‌లో అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 
– ఆళ్ల కాళీకృష్ణశ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి  

రాజకీయాలకే వన్నె తెచ్చారు..
నీతిమంతుడు.. నిజాయితీపరుడు మా గౌతమ్‌రెడ్డి. సీఎం ఆయనపై పెట్టిన బాధ్యతను సమర్థంగా 
నిర్వర్తించడానికి నిరంతరం శ్రమించారు. గౌతమ్‌ రాజకీయానికే వన్నె తెచి్చన నాయకుడు. 
– నారాయణస్వామి, ఉప ముఖ్యమంత్రి 

ఆయన మృతి తీరని లోటు..
ఎంతో ఆరోగ్యంగా ఉండే మంత్రి గౌతమ్‌రెడ్డి అకస్మాత్తుగా చనిపోవటం అత్యంత బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. 
– మేకతోటి సుచరిత, హోంశాఖ మంత్రి 

పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారు..
చిన్న వయస్సులోనే గౌతమ్‌రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. మంత్రిగా చాలా చురుగ్గా పనిచేశారు. నిన్నటివరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారు. ఆయన హఠాన్మరణం బాధిస్తోంది. 
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి  

అన్నలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం
మా అందరి జీవితంలో అత్యంత విషాదకర రోజు. సొంత అన్నలాంటి గౌతమ్‌రెడ్డిని కోల్పోవడం జీరి్ణంచుకోలేకపోతున్నాం. 2009 నుంచి గౌతం అన్నతో ప్రయాణం చేస్తున్నాం. పార్టీలతో సంబంధం లేకుండా, చిన్న వివాదం రాకుండా అందరితో సన్నిహితంగా, నవ్వుతూ ఉండేవారు. 
– అనిల్‌కుమార్‌యాదవ్, జలవనరులశాఖ మంత్రి 

అత్యంత సమర్థులు
గౌతమ్‌రెడ్డి  లేని లోటు తీరనిది. పరిశ్రమలశాఖను అత్యంత సమర్థంగా నిర్వహించారు.  వారి కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెపుతున్నాం.   
– ఆదిమూలపు సురేష్‌, విద్యాశాఖ మంత్రి 

సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేశారు
వివాదరహితుడు.. విద్యావంతుడైన పారిశ్రామికవేత్త గౌతమ్‌రెడ్డి. రాష్ట్రంలో పరిశ్రమలను అభివృద్ధి చేయాలనే సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా పని చేశారు.  
– చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహనిర్మాణశాఖ మంత్రి 

పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి..
విదేశాల్లో ఎంఎస్‌ చేసి ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడగల ఉన్నత విద్యావంతుడు గౌతమ్‌రెడ్డి. రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకువెళ్లడంలో పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి అకాలమరణం షాక్‌కు గురిచేసింది. 
– పినిపే విశ్వరూప్, సాంఘికసంక్షేమశాఖ మంత్రి 

జీర్ణించుకోలేకపోతున్నా.. 
సహచరుడు, మిత్రుడు మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. వారి మృతికి నా వినమ్ర శ్రద్ధాంజలి.
– చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి 

నమ్మలేకపోతున్నా..
సహచర మంత్రిగా, స్నేహితుడిగా ఆయనతో చాలా జ్ఞాపకాలున్నాయి. ఆయన మృతి వార్తను నమ్మలేకపోతున్నాం.  
– ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటకశాఖ మంత్రి  

Advertisement
Advertisement