చంద్రబాబూ.. బీసీలకు క్షమాపణ చెప్పండి | YS Jagan demands Chandrababu Naidu apologize for BCs on reservations | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. బీసీలకు క్షమాపణ చెప్పండి

Oct 10 2026 4:46 AM | Updated on Oct 10 2026 4:46 AM

YS Jagan demands Chandrababu Naidu apologize for BCs on reservations

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ డిమాండ్‌

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు మభ్యపెట్టడం ఘరానా మోసం 

విద్యా దీవెన, వసతి దీవెనలకు దాదాపు రూ.9 వేల కోట్లు బకాయి పెట్టడం ఇంకో మోసం 

143 హామీలతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో అతిపెద్ద మోసం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాలు పచ్చి బూటకమని, సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఆయన నయవంచన పూర్తిగా బట్టబయలైందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేయడంలో ఆయన 420 అని మరోమారు స్పష్టమైందన్నారు. ఇప్పటికైనా బీసీలకు క్షమా­పణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

‘‘చంద్రబాబు గారూ.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మీరు నమ్మించి వంచించారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సాక్షిగా నిర్ధారణ అయింది. మీరు పెద్ద మోస­కారి అని మరో­సారి తేలిపోయింది. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ పేరిట మీరు ఇచ్చిన హామీలు మోసం. గతంలో మా ప్రభుత్వంలో వారికి వచ్చే పథకాలు రద్దు చేయడం మరొక మోసం. విద్యా దీవెన, వసతి దీవెనలకు దాదాపు రూ.9 వేల కోట్లు బకాయి పెట్టి చేస్తున్నది ఇంకో దారుణమైన మోసం. 143 హామీలతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో అతిపెద్ద మోసం. చివరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు మీరు మభ్యపెట్టింది కూడా ఒక ఘరానా మోసమే’’ అని వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement