ఇస్రో సెంచరీ.. ఏపీకి గర్వకారణం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Congratulates ISRO Sriharikota 100th Mission Success, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇస్రో సెంచరీ.. ఏపీకి గర్వకారణం: వైఎస్‌ జగన్‌

Jan 29 2025 8:06 AM | Updated on Jan 29 2025 2:26 PM

YS Jagan Congratulates ISRO Sriharikota 100th Mission Success

గుంటూరు, సాక్షి: శ్రీహరికోట నుంచి వందో రాకెట్‌ ప్రయోగం విజయవంతమైన వేళ.. వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు అభినందనలు  తెలియజేశారు. శ్రీహరికోట నుంచి 100వ రాకెట్ ప్రయోగాన్ని సక్సెస్ చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరెన్నో విజయవంతమైన ప్రయోగాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

భారత అంతరిక్ష పరిశోధనలకు ముఖద్వారంగా మారిన శ్రీహరికోట ఏపీలో ఉండడం ఎంతో గర్వకారణమన్నారు. అంతరిక్ష సాంకేతికతలో ఇస్రో అత్యున్నతమైందని కొనియాడారు. అంతరిక్ష పరిశోధనల్లో ఈ ప్రయోగంతో భారతదేశ ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారాయన. భవిష్యత్తులోనూ ఇస్రో చేపట్టే ప్రయోగాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారాయన. 

శ్రీహరికోట నుంచి ఈ ఉదయం ఇస్రో చేపట్టిన చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్‌.. ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. ఆపై ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివెరిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement