కోనేరు హంపికి వైఎస్‌ జగన్‌ అభినందనలు | YS Jagan Congratulates chess grandmaster Koneru Humpy | Sakshi
Sakshi News home page

కోనేరు హంపికి వైఎస్‌ జగన్‌ అభినందనలు

Dec 29 2024 11:03 AM | Updated on Dec 29 2024 1:13 PM

YS Jagan Congratulates chess grandmaster Koneru Humpy

సాక్షి, తాడేపల్లి: భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. కోనేరు హంపికి అభినందనలు తెలిపారు. ఈ అపూర్వ విజయంతో ఆమె స్వస్థలంతోపాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు.

తెలుగు తేజం కోనేరు హంపి విజయంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌..‘ప్రతిష్టాత్మకమైన 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత విజయం సాధించటం అందరికీ గర్వకారణం. ఈ అపూర్వ విజయం ఆమె స్వస్థలంతోపాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచింది. ఆమె విజయం యువ ప్రతిభావంతులకు, ముఖ్యంగా బాలికలకు స్ఫూర్తిదాయకం. హంపీ నిరంతర కృషి, నిబద్ధతతో ప్రపంచ అత్యుత్తమ చెస్ క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ అభినందనలు తెలిపారు. 

 

 


 

Advertisement
 
Advertisement
Advertisement