
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మందుబాబులు హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా పుష్ప డైలాగులతో మందు బాబులు పోలీసులకు సవాల్ విసిరారు. దీంతో, ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. అనంతపురం వన్ టౌన్ పీఎస్ పరిధిలో గంజాయి, మద్యం మత్తులో యువకులు హల్‌చల్ చేశారు. ఇద్దరు యువకులు కలిసి.. మరో యువకుడిని విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం, పుష్ప సినిమాలోని దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా అనంతపురం అంటూ డైలాగ్ చెప్పారు. పోలీసు స్టేషన్ ఎదుటే ఇలా డైలాగ్ చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.