ప్రేమ వ్యవహారం నడిపి.. పెళ్లి చేసుకోవడానికి..! | Young Woman Seeking Justice In Guntur District | Sakshi
Sakshi News home page

ప్రేమ వ్యవహారం నడిపి.. పెళ్లి చేసుకోవడానికి..!

Aug 15 2020 7:08 AM | Updated on Aug 15 2020 7:08 AM

Young Woman Seeking Justice In Guntur District - Sakshi

సాక్షి, రాజుపాలెం: ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి మౌనపోరాటానికి దిగింది. ఈ ఘటన రాజుపాలెం మండలం ఉప్పలపాడు శివారు చల్లాపల్లి తండాలో జరిగింది. యువతి కుటుంబ సభ్యుల వెల్లడితో శుక్రవారం విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. చల్లాపల్లి తండాకు చెందిన యువతి అదే తండాకు చెందిన శివానాయక్‌ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

శివానాయక్‌ విజయవాడలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ప్రేమ వ్యవహారం నడిపి చివరకు పెండ్లి చేసుకోవడానికి అతడు అంగీకరించక పోవడంతో యువతి రెండు రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ వైద్యశాల నుంచి వచ్చి యువకుడి ఇంటి ముందు ధర్నా చేస్తోంది.    (విజయనగరంలో ’విష సంస్కృతి’)

Advertisement
 
Advertisement
Advertisement