మా బాబు బంగారం

World Skating Games: Vizianagaram Youth Qualified To Participate Argentina - Sakshi

సాక్షి,విజయనగరం: జిల్లాకు చెందిన క్రీడాకారుడు చందక వెంకట పవన్‌ కార్తికేయ రోలర్‌ స్కేటింగ్‌లో రాణిస్తున్నాడు.  2019 జూలైలో స్పెయిన్‌ దేశంలోని బార్సిలోనాలో జరిగిన వరల్డ్‌ రోలర్‌ గేమ్స్‌ భారత దేశం తరఫున ప్రాతినిథ్యం వహించిన ఒకే ఒక్క క్రీడాకారుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు.  అర్జెంటీనాలోని శాన్‌ జువాన్‌లో అక్టోబర్‌లో జరగబోయే వరల్డ్‌ రోలర్‌ గేమ్స్‌–2022 ప్రపంచ పోటీలకు అర్హత సాధించాడు. పతకం సాధనే లక్ష్యంగా కఠోర సాధన చేస్తున్నాడు. ఆయనకు ప్రభుత్వం అండగా నిలుస్తుండడంతో తన ప్రతిభకు  పదును పెడుతున్నాడు.

విజయనగరానికి చెందిన కార్తికేయకు క్రీడలంటే ఆసక్తి. మూడో తరగతి వరకు టెన్నిస్‌లో శిక్షణ పొందిన కార్తికేయ... నాలుగో తరగతి నుంచి రోలర్‌ స్కేటింగ్‌లో తర్ఫీదు పొందుతున్నాడు. తల్లిదండ్రులు సురేష్‌కుమార్, వెంక ట ఆత్మాంబికల ప్రోత్సాహంతో  శిక్షకుడు కె.కృష్ణకుమార్‌ వద్ద మెలకువలు నేర్చుకుని పట్టు సాధించాడు. కాళ్లకు చక్రాలు కట్టుకుని రింగ్‌లో గిర్రు గిర్రున తిరుగుతూ కళ్లు చెదిరేలా విన్యాసాలాతో అలరిస్తున్నాడు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తున్నాడు.  జిల్లా, రాష్ట్రస్థాయిలో పతకాలు సాధిస్తూ నేడు అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. 10వ తరగతి వర కు విశాఖలో చదివిన కార్తికేయ ఇంటర్‌ మీడియట్‌ను ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ డిఫెన్స్‌ అకాడమీలో పూర్తి చేశాడు. ప్రస్తుతం విశాఖ బుల్లయ్య కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు సిద్ధమవుతున్నాడు.

పవన్‌ సాధించిన పతకాలు..
 2019, 2020, 2021 సంవత్సరాల్లో రోలర్‌ స్కే టింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగి న జాతీయస్థాయి పోటీల్లో వరుసగా మూడు బంగారు పతకాలు కైవసం చేసుకున్నాడు. 
 2018వ సంవ త్సరంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకం.   
 2019లో రాష్ట్ర ప్రభుత్వం  వైఎస్సార్‌ క్రీడా పురస్కారాల్లో భా గంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశా ల మేరకు రూ. 75,000 నగదు ప్రోత్సాహకం  అందుకున్నాడు. 
 2020 సంవత్స రం డిసెంబర్‌ నెలలో  రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించినందుకు ఉత్తరాఖండ్‌ ప్రభు త్వం నుంచి రూ.50,000  నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నాడు.   
 2022, ఏప్రిల్‌ నెలలో పంజాబ్‌ రాష్ట్రంలోని మొహాలీలో జరిగిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరిచి∙అర్జెంటీనాలో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు.  
 ఈ ఏడాది అక్టోబర్‌లో అర్జెంటీనాలోని శాస్‌ జు వాస్‌లో జరగబోయే వరల్డ్‌ రోలర్‌ స్కేటింగ్‌  గేమ్స్‌ కు హాజరయ్యేందుకు జిల్లాపరిషత్‌ నిధులు రూ. 2.65 లక్షల మొత్తాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ, కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి ఇటీవల అందజేశారు.  

స్కేంటింగ్‌ అంటే ఇష్టం  
చిన్న తనం నుంచి స్కేటింగ్‌ క్రీడ అంటే ఎంతో ఇష్టం. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం మరువలేనిది. వారి సహకారంతోనే అంతర్జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిథ్యం వహించగలుగుతున్నాను. 2022 అక్టోబర్‌ 24 నుంచి నవంబర్‌ 14వ తేదీ వరకు అర్జెంటీనాలోని శాస్‌ జువాస్‌లోలో జరగబోయే వరల్డ్‌ రోలర్‌ గేమ్స్‌కు ఎంపికయ్యాను. బంగారు పతకం సాధించడమే లక్ష్యం.  
– చందక వెంకట పవన్‌కార్తికేయ

చదవండి: ఇద్దరూ ఇద్దరే..  స్కేటింగ్‌లో చిరుతలే.! 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top