
సాక్షి, విశాఖపట్నం: వాహన మిత్ర అమలు చేయాలని ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. వాహన మిత్ర ద్వారా రూ.15 వేలు ఇస్తామని కూటమి హామీ ఇచ్చిందని.. ఏడాది పూర్తయినా కానీ.. ఇచ్చిన హామీకి దిక్కు లేకుండా పోయిందంటూ ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఇచ్చిన హామీనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆటో డ్రైవర్లు అన్నారు. ‘‘డీజిల్, పెట్రోల్ ధరలు అధికంగా పెరుగుతున్నాయి. ఆర్టీఏ అధికారులు ఆటో డ్రైవర్లను కేసులతో వేధిస్తున్నారు. రోడ్లు బాగాలేక విపరీతంగా పెట్టుబడి పెరుగుతుంది. ఆటో డ్రైవర్లు కూటమి పాలనలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆటో యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.