
సాక్షి, కృష్ణా: ఏపీలో వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా చంద్రబాబు కూటమి సర్కార్ అక్రమ కేసులో పెడుతోంది. తాజాగా మాజీ మంత్రి కొడాలి నానిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఐటీ యాక్ట్ కింద కొడాలి నానిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే నానికి నోటీసులు ఇచ్చారు.
వివరాల ప్రకారం.. కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు కుటుంబాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ 2024లో విశాఖ-3 టౌన్ పోలీసు స్టేషన్‌లో విశాఖకు చెందిన అంజనా ప్రియ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు.. కొడాలి నానిపై U/S353(2),352,351(4), 196(1) BNS 467, IT Act కింద కేసు నమోదు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కొడాలి నానికి 41ఏ కింద విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
