కొత్త రన్‌వేపై ఇక రయ్‌.. రయ్‌! | Sakshi
Sakshi News home page

కొత్త రన్‌వేపై ఇక రయ్‌.. రయ్‌!

Published Sat, Nov 14 2020 1:56 PM

Vijayawada Airport Ready to New Runway for Operations Soon - Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్‌వే ట్రయల్‌ రన్‌కు సిద్ధమవుతోంది. రూ.125 కోట్ల వ్యయంతో 1,074 మీటర్ల మేర రన్‌వే నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పటికే 2,286 మీటర్ల పొడవున్న పాత రన్‌వేపై విమానాల టేకాఫ్‌, ల్యాండింగ్‌ తీసుకుంటున్నాయి. విమానాశ్రయానికి పెరుగుతున్న విమానాల తాకిడిని దృష్టిలో ఉంచుకుని కొత్త రన్‌వే నిర్మించారు. ఇది అందుబాటులోకి రావడంతో విమానాశ్రయంలో మొత్తం రన్‌వే పొడవు 3,360 మీటర్లకు చేరింది. దీనిపై ట్రయల్‌ రన్‌కు అనుమతిలిస్తూ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఉత్తర్వులిచ్చినట్లు సమాచారం. ఈ నెలాఖరు నాటికి కొత్త రన్‌వేపై విమానాల టేకాఫ్‌, ల్యాండింగ్‌ల ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. ట్రయల్‌ రన్‌ విజయవంతమయ్యాక ఈ రన్‌వే దేశీయ, అంతర్జాతీయ విమానాల టేకాఫ్‌, ల్యాండింగ్‌కు అనువైనదిగా గుర్తింపు వస్తుంది. (దేశీయ ప్రయాణాలకు ఊపు)

Advertisement
Advertisement