దాడిచేసింది వారు.. మాపై కేసులా? | Sakshi
Sakshi News home page

దాడిచేసింది వారు.. మాపై కేసులా?

Published Sun, May 19 2024 6:10 AM

మాచవరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద మాట్లాడుతున్న కొత్త గణేశునిపాడు గ్రామస్తులు

మా ఇళ్లల్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు

ఇంట్లోని గృహోపకరణాలను ధ్వంసం చేశారు

వారిని వదిలి పెట్టి ఊరు వదిలి వెళ్లిపోయిన మాపై కేసులేంటి?

పోలీసుల తీరుపై కొత్తగణేశునిపాడు బాధితుల ఆవేదన

మాచవరం: వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవ­హరిం­చామన్న కోపంతో మా ఇళ్లపై దాడులు చేసి... బీభత్సం సృష్టించిన టీడీపీ వర్గీయులను వదిలేసి... బాధితులైన మాపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మాచవరం పోలీస్‌స్టేషన్‌ వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్‌ రోజున ఓట్లు వేసేందుకు వచ్చిన మమ్ములను అడ్డు­కు­న్నారనీ, ఇదేమని ప్రశ్నించిన వారిపై దూషణకు దిగి, పోలింగ్‌ అనంతరం మీ సంగతి చూస్తామంటూ బెదిరించారని చెప్పారు. 

ప్రణాళిక ప్రకారం ఇతర గ్రామాలకు చెందిన టీడీపీ రౌడీలను కార్లలో తీసుకువచ్చి మా ఇళ్లపై దాడులు చేసి, ఇళ్లలోని వస్తువులను ధ్వంసం చేస్తూ, ఇంట్లో ఉన్న మహిళ­లను దూషిçస్తూ, భౌతిక దాడులకు పాల్పడ్డారని తెలిపారు. బైకులు, ఆటోలు, ఇతర వాహనాలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారని, భయాందోళనతో మేమంతా పొలాల వెంట పరుగులు తీశామని, మహిళలు గంగమ్మగుడిలో తలదాచుకు­న్నారని చెప్పారు. అక్కడకు కూడా వెళ్లి గుడి గేటు తాళాలు బిగించి ఇబ్బందులు పెట్టారని, సుమారు నాలుగు గంటల పాటు టీడీపీ గూండాలు గ్రామంలో వీరంగం చేస్తుంటే ఒక్క పోలీస్‌ అధికారి కూడా గ్రామానికి రాలేదన్నారు. 

విష­యం తెలుసుకున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌­రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ బాధితులను పరామర్శించేందుకు గ్రామానికి మరు­నాడే చేరుకుని మహిళలను ఇళ్ల వద్దకు చేర్చి, విధ్వంసానికి గురైన ఇళ్లను, ఆస్తి నష్టాన్ని పరిశీలిస్తున్న సమయంలో వారిపైనా దాడికి యత్నించారని చెప్పా­రు. రాళ్లతో దాడిచేసి, కార్లను సైతం పగలగొ­ట్టారని చెప్పారు. ఆ సమయంలో పో­లీ­సులు గాలిలోకి కాల్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. తాము భయంతో వేరే ఊళ్లో తలదాచుకుంటే తమపై కేసులు పెట్టడం దారుణమన్నారు.

మాపై కేసులు పెట్టడం అన్యాయం
గ్రామంలో టీడీపీ వాళ్లు సృష్టించిన బీభత్సానికి భయంతో గ్రామాన్ని విడిచి పొరు­గూరిలో బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకున్నాం. భార్యాపి­ల్లలు ఇంటి వద్ద బిక్కుబిక్కుమంటూ గడు­పుతు­న్నారు. గ్రామంలో వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఊళ్లో లేని మాపై పోలీసులు కేసులు పెట్టడం అన్యాయం.    
– అంబటి వెంకటేశ్వర్లు  

వైఎస్సార్‌సీపీకి ఓటేశామనే మాపై కక్ష
వైఎస్సార్‌సీపీకి ఓటేశా­మని మాపై కక్ష పెంచుకు­న్నా­రు. బీసీలకు పార్టీ­లు ఎందుకు­రా అంటూ పలుసార్లు అవమా­నించారు. అయినా ఓర్చుకొని పార్టీకోసం నిలబడ్డాం. వారి దాడులతో ఊరు వదిలి వెళ్లి ఐదు రోజులైంది. మాపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారు.     
– మేకల హనుమంతు

పోలీసులు రక్షణ కల్పించాలి
ఎన్నికల రోజు టీడీపీ గూండాలు చేసిన దాడులకు భయపడి పారి­పోయాం. భార్యా పిల్లల­తో బంధువుల వద్ద తల­దాచు­కుంటున్నాం. టీడీపీ వాళ్లు దాడులు చేస్తే మాపై కేసులు పెట్టారు. ఇదేమి న్యాయం. గ్రామంలోకి వెళ్లాలంటే భయంగా ఉంది. పోలీసులు రక్షణ కల్పించాలి.    
– బొంతా ప్రసాద్‌  

Advertisement
 
Advertisement
 
Advertisement