మీ సేవ కేంద్రాల మనుగడ కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

మీ సేవ కేంద్రాల మనుగడ కాపాడాలి

Feb 23 2026 7:36 AM | Updated on Feb 23 2026 7:36 AM

మీ సేవ కేంద్రాల మనుగడ కాపాడాలి

మీ సేవ కేంద్రాల మనుగడ కాపాడాలి

మీ సేవ కేంద్రాల మనుగడ కాపాడాలి

ఏపీ మీసేవ నిర్వాహకుల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు రాము

జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

నరసరావుపేట: మీ సేవల మనుగడను కాపాడాలని ఏపీ మీసేవ ఆపరేటర్ల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు పోరుమామిళ్ల రాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం పాతూరులోని గీతామందిర్‌లో నిర్వహించిన అసోసియేషన్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత 25ఏళ్లుగా ప్రజలకు మీసేవల ద్వారా ప్రభుత్వసేవలు అందిస్తూ చాలీచాలని ఆదాయంతో బతుకుతున్న ఆపరేటర్లకు భరోసానిస్తూ ప్రభుత్వం మీ సేవల మనుగడును కాపాడాలని కోరారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ అప్పటి యువగళం పాదయాత్రలో సమస్యలను వివరించగా తాము అధికారంలోకి రాగానే మీ సేవలకు మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని, ఆపరేటర్ల సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చారని, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా మీ సేవ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగానే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

అనంతరం ఏపీ మీసేవ నిర్వాహకుల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ పల్నాడు జిల్లా నూతన కమిటీని స్టేట్‌ అధ్యక్షులు పోరుమామిళ్ల రాము ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా గట్టుపల్లి మహేష్‌, ఉపాధ్యక్షులుగా కొత్త శేషగిరిరావు గౌరవ అధ్యక్షులుగా కొమ్ము ప్రకాష్‌, దాసరి రాజశేఖర్‌, వేల్పూరు గణపతి, ప్రధాన కార్యదర్శిగా జలసూత్రం హరిబాబు, కార్యదర్శిగా రాయుడు సతీష్‌, నూలి శ్రీను, కాట్ల రామాంజనేయులు, మహిళా కార్యదర్శి గాదె శాంత కుమారి ఎన్నికయ్యారు. స్టేట్‌ కమిటీ సెక్రటరీ బుచ్చిబాబు, యాసిన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement