ఉయ్యాలవాడకు ఘన నివాళి
నరసరావుపేట: తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆదివారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఆర్‌టీఓ జి.సంజీవకుమార్ నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ బ్రిటిషు వారి రైతువారి వ్యవస్థ అమలు, పాలెగాళ్ల హక్కులు రద్దు, రైతులపై అధిక పన్నులు నేపథ్యంలో నరసింహారెడ్డి ఐదు వేలమంది రైతులతో కలిసి 1846లో తిరుగుబాటు ప్రారంభించారని పేర్కొన్నారు.
నగరం: గుంటూరు జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరం బాల ఏసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం నిర్వహించారు. పోటీల్లో దుర్గి జడ్పీహైస్కూల్ విద్యార్థులు విజేతలుగా నిలవగా, నగరం బాల ఏసు ఇంగ్లిష్ మీడియం స్కూల్ రన్నర్స్‌గా నిలిచింది. దూళిపాళ్ల జెడ్పీ హైస్కూ ల్, శేకూరు జెడ్పీ హైస్కూల్ టీమ్‌లు వరుసగా మూడవ, నాలుగు స్థానాలలో నిలిచాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. ఏపీ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఇ.శివశంకర్, గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ వై.శ్రీనివాసరావు, నంబూరు స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ సెలక్షన్ కమిటీ సభ్యుడు బి.నర్సయ్య, స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ సునా, ప్రిన్సిపాల్ సిస్టర్ సజీవా, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మృతుడిది గుంటూరు జిల్లా నందివెలుగు
సింగరాయకొండ: ముందు వెళ్తున్న కంటైనర్ లారీ ఒక్కసారిగా నెమ్మది కావడంతో ఆ వెనుకాల వేగంగా పుచ్చకాయ లోడుతో వచ్చిన లారీ బలంగా ఢీకొంది. దీంతో మినీ వ్యాన్ డ్రైవర్ ఇగ్గోలు వెంకట సుబ్బారావు(35) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారి, కందుకూరు ఫ్లైఓవర్‌పై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మినీ లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు పుచ్చకాయలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతి చెందిన సుబ్బారావుది గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని నందివెలుగు. ఘటనాస్థలాన్ని ఎస్‌ఐ మహేంద్ర పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
నెహ్రూనగర్: మూడు చక్రాల స్కూటర్ల మంజూరుకు ఈ నెల 25న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎన్.వెంకటరవణప్ప ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా శారీరక విభిన్న ప్రతిభావంతులు మూడు చక్రాల స్కూటర్లు మంజూరుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. వారు మాత్రమే ఇంటర్వ్యూలకు అర్హులని వివరించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ ఒకటో లైన్‌లో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలని కోరారు.
తెనాలిరూరల్: మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా పరిచయమై వివాహం చేసుకుంటానని నమ్మబలికి పెద్ద మొత్తంలో నగదు కాజేసి మోసం చేసిన నిందితుడిని తెనాలి త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆదివారం సీఐ ఎస్.సాంబశివరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. పట్టణంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న మహిళకు కొల్లిపర మండలం కొత్తూరులంక గ్రామానికి చెందిన అరవపల్లి వంశీ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ఈనెల 2వ తేదీన పరిచయమయ్యాడు. తనకు వివాహమై విడాకులు తీసుకున్నానని తిరిగి వివాహం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఆమెను నమ్మించాడు. మహిళ ఇంటికి కూడా వచ్చి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి వివాహానికి ఒప్పించాడు. తదుపరి టిప్పర్ కొనుగోలుకు నగదు కావాలని నమ్మించి, వివిధ మార్గాలలో లోను తీసుకునేలా ప్రేరేపించి ఆమె నుంచి రూ.12.20 లక్షలు వసూలు చేశాడు. వివాహం చేసుకోనున్నట్లు నమ్మించి ఈనెల 8న శారీరకంగా లోబరుచుకున్నాడు. మరింత నగదు కావాలంటూ ఆమైపె ఒత్తిడి పెంచడంతో ఇవ్వలేనని తేల్చి చెప్పింది. దీంతో ఆమెను కొట్టి, చంపుతానని బెదిరించి, వివాహానికి నిరాకరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. సమావేశంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఉయ్యాలవాడకు ఘన నివాళి


