
కడప రూరల్: డాక్టర్ వేమిరెడ్డి రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (డైరెక్టర్)గా నియమితులయ్యారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి రాష్ట్ర స్ధాయి అత్యున్నత పదవిలో వైఎస్సార్ జిల్లాకు చెందిన వారు నియమితులు కావడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. ఈయన జిల్లా అంధత్వ నివారణ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్‌గా పనిచేశారు.
తరువాత పదోన్నతిపై అడిషనల్ డైరెక్టర్‌గా అమరావతికి వెళ్లారు. తాజాగా డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ రామిరెడ్డి నియామకం పట్ల జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.