AP: సచివాలయ సేవలు బాగున్నాయి.. కేంద్ర మంత్రి కితాబు

Union Minister Narayana Swamy Appreciated Services Of AP Secretariat - Sakshi

భీమవరం అర్బన్‌: ఏపీలో అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ సేవలు బాగున్నాయని, ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను, సచివాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న గ్రామస్తులను పలకరించి.. ఎన్ని డోసులు వేయించుకున్నారు.. ఈ వ్యాక్సిన్‌ ఎవరు ఇస్తున్నారనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం సచివాలయాన్ని సందర్శించి కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్, మహిళా కానిస్టేబుల్, వ్యవసాయ శాఖ సిబ్బంది విధులను అడిగి తెలుసుకున్నారు. వలంటీర్ల సేవలు, వారికిచ్చే వేతనం గురించి ఆరా తీశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలను సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజావసరాలను, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల ఇంటి ముంగిటకే తీసుకెళ్లడం అభినందనీయమని కితాబిచ్చారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ పాకా సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ, జిల్లా అధ్యక్షుడు నారిన తాతాజీ తదితరులు ఉన్నారు. 

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్‌ కొత్త కాన్వాయ్‌కు ‘ఏపీ బుల్లెట్‌ ప్రూఫ్‌’ వాహనాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top