
తిరుపతి: తిరుపతిలో సీజీహెచ్‌ఎస్ (సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం) వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. దీనికి సంబంధించి ఏప్రిల్ 4న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్టు పేర్కొన్నారు. దీనికి స్పందించిన కేంద్రం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసిందని ఎంపీ తెలిపారు.
కేవలం విజయవాడ, నెల్లూరు, విశాఖ, గుంటూరుకు మాత్రమే పరిమితమైన ఈ వెల్‌నెస్ సెంటర్ తిరుపతిలో కూడా ఏర్పాటు చేయడం ద్వారా 15 వేల మంది కేంద్ర ప్రభుత్వ సంస్థాగత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పదవీ విరమణ పొందిన వారికి సరైన వైద్యం, రిఫరల్ సౌకర్యాలు అందుతాయన్నారు.